రజినీకే వదిలేయనున్న సూర్య?
దేవర సినిమా అక్టోబర్ 10 నుంచి ప్రీపోన్ అవగానే ఆ డేట్ ను సూర్య కంగువ లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. సౌత్ లోనే అతి పెద్ద పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాకు ముందు ఎలాంటి పోటీ లేదు. కానీ కొన్నాళ్ల కిందట సడెన్ గా రజినీకాంత్ వెట్టయాన్ ను కూడా అదే తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.
దసరాకు ఇంత భారీ క్లాష్ ను ఎవరూ ఊహించలేదు. దానికి తోడు కంగువ సింగిల్ గా వస్తేనే లాభముంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పోటీ నుంచి కంగువ వెనుకడుగేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలంటున్నాయి. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ నెలాఖరుకి ఈ సినిమాను తీసుకెళ్లే విధంగా సీరియస్ గా ఆలోచన జరుగుతుందట.
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఒకట్రెండు రోజుల్లో వస్తుందంటున్నారు. రజినీతో పోటీ పడే సమస్యే లేదని గతంలో జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలను ఇప్పుడు రజినీ ఫ్యాన్స్ బయటకు తీసి మరీ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడా కారణంగానే వెనుకడుగేస్తున్నారంటున్నారు. అయితే సూర్య మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నాడని, ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది తామే కాబట్టి ఎందుకు వెనక్కి తగ్గాలనుంటున్నాడట. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల థియేటర్లు, కలెక్షన్స్ షేర్ అవుతాయి కాబట్టి వెట్టయాన్ కు వదిలేద్దామని నిర్మాత జ్ఞానవేల్ రాజా అంటున్నాడట. అతి త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.













