ఐశ్వర్యరాయ్ ఔట్… ఈ ఏడాది కంగనా
ఏటా కేన్స్ ఫెస్టివల్లో కళ్లుచెదిరిపోయే డ్రస్సులతో ఐశ్వర్యరాయ్ అదరగొడుతూ ఉంటుంది. ఈ ఏడాది ఈ రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం కొత్తగా టాలెంటెడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ను వరించింది. మే 8 నుంచి 19 వరకు జరిగే 71వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కంగనా సందడి చేయనుంది. మొదటిసారి దక్కిన ఈ అవకాశంతో బాలీవుడ్ క్వీన్ ఉబ్బితబ్బిబవుతోంది. కేన్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమా గుర్తింపు పొందే క్షణాలను కళ్లారా చూడటం అత్యంత గౌరవంగా భావిస్తున్నా, అంటూ కంగనా తన ఆనందం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం కంగనా తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్వకత్వంలో మణికర్ణిక సినిమా చేస్తోంది. వీరవనిత ఝాన్సీలక్ష్మీబాబు జీవిత గాథగా ఈ సినిమా రాబోతోంది.













