లాస్ ఏంజెలెస్‌లో తలైవి..
ఓ నటి, రాజకీయ నాయకురాలు, ముఖ్యమంత్రి పాత్రలో చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఆమె చాలా మందికి అమ్మ. అందుకే కంగనా రనౌత్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆమె నటిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం అమెరికా వెళ్లింది. అక్కడ లాస్ఏంజెల్స్లో థలైవి లుక్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఓ అవార్డు వేడుకకు వెళ్లింది. అక్కడ నుంచి అమెరికాకు వెళ్లింది. యుఎస్‌లో హాలీవుడ్ నిపుణులు క్యాపిటల్ మార్వెల్స్, బ్లాడే రన్నర్ 2049 ఫేమ్ జాసన్ కోలిన్స్ ఆధ్వర్యంలో ఈ లుక్ టెస్ట్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ ఈ పాత్రలో నా హావభావం, ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలియదు కానీ, లుక్ కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నాకు మాత్రం ఇదొ ప్రత్యేకమైన అనుభవం అని తెలిపింది. ఈ బహుభాషా చిత్రం షూటింగ్ దీపావళి తర్వాత మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ మైసూర్, కర్నాటకలో ఉండనుంది. ఈ థలైవి చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ నిర్మిస్తున్నారు.













