క్వీన్‌కు మరో అరుదైన గౌరవం
కంగనా రనౌత్ ప్రధానపాత్రలో రాజ్‌కుమార్‌రావ్ హీరోగా వికాస్ భల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం క్వీన్. ఘన విజయం సాధించింది. 2014లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో కంగనా నటనకు మంచి మార్కులుపడ్డాయి. జాతీయస్థాయిలో పలు అవార్డులు పొందిన క్వీన్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. చైనా బీజింగ్ లోని భారత రాయబారా కార్యాలయంలోని ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. ఈ నెల 26న ఈ ప్రదర్శన ఉంటుందని తెలిసింది. కాగా తెలుగు, తమిళ, క్వీస్ మూవీ రీమేక్స్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.













