కంగు తినిపిస్తున్న కంగనా
బాలీవుడ్లో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకునే దిశగా కంగనా రనౌత్ అడుగులు వేస్తోంది. గ్లామర్ పాత్రలతో తన కెరీర్ మొదలు పెట్టిన కంగనా, ఇప్పుడు మరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. తెలుగులో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాష్ సరసన ఏక్ నిరంజన్‌లో నటించిన కంగనా, ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ఖ్యాతి గడిస్తోంది. మణికర్ణిక చిత్రానికి గాను ఈ భామ ఏకంగా పద్నాలుగు కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు, సినిమాకు వచ్చే లాభాల్లో కొంత పర్శంటేజ్ కూడా తీసుకుంటున్నదని, సదరు పర్శంటేజ్ ద్వారా మరో పది పన్నెండు కోట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.













