కంగనా నిర్మాతగా అపరాజిత అయోద్య
అయోధ్య రామమందిరం నేపథ్యంలో బాలీవుడ్ అగ్రనాయిక కంగనారనౌత్ ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నది. ఇటీవలే ఆమె ‘రాణీ ఆఫ్ ఝాన్సీ’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఇందులో తొలి ప్రాజెక్ట్‌గా అయోధ్య రామమందిరం నేపథ్యంలో అపరాజిత అయోధ్య పేరుతో సినిమా చేయబోతున్నట్లు కంగనారనౌత్ ప్రకటించింది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథనందిస్తున్నారని ఆమె వెల్లడించింది. అయోధ్య కేసు దేశరాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసింది. చివరకు ఈ వివాదం లౌకిక స్ఫూర్తిని చాటే తీర్పుతో ముగిసింది. ఓ నాస్తికుడు ఆస్తికుడిగా ఎలా మారాడనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం అని కంగనారనౌత్ పేర్కొన్నారు.













