కొందరి కుట్రల కారణం గానే సుశాంత్ బలైయ్యాడు – ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ నేపథ్యంలో హిందీ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కంగన రనౌత్ దుమ్ముదులిపింది. సుశాంత్ సింగ్ మరణాన్ని మరో విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న బాలీవుఢ్ ప్రముఖులపై ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ భగ్గుమంది. తాము చేసిన చేసిన పనులను కప్పిపుచ్చుకోవడానికి ఇండస్ట్రీలోని ఓవర్గం మీడియాను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్లో వారసత్వంగా వచ్చే హీరోలు, హీరోయిన్లకే ప్రోత్సాహం ఉంటుంది. బంధుప్రీతి, ఫేవరిటిజం అంశాలే స్టార్ హోదాలను నిర్ణయిస్తాయని గతంలో కరణ్ జోహార్‌పై మండిపడిన ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ మరోసారి భగ్గుమన్నారు. సుశాంత్ మరణంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు నిమిషాల వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో మాట్లాడుతూ..
సినిమా ఇండస్ట్రీ అనేది బాలీవుడ్లో స్టార్ హీరోల పిల్లలకే మాత్రమే భవిష్యత్తు ఉండాలా? ఇండస్ట్రీలో రాణించాలని బయట నుంచి వచ్చే ప్రతిభావంతులు పనికిరారా? అంటూ కంగన రనౌత్ అగ్రహం వ్యక్తం చేశారు. బంధుప్రీతి, తమ వాళ్లకే అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలు సరికావు. ఇలా ఆలోచించే కొందరు వ్యక్తులు ఎలైట్ కల్బ్ గ్రూప్ ఆఫ్ బాలీవుడ్ లేదా బాలీవుడ్ మాఫియాగా చెలామణి అవుతున్నారు అంటూ గతంలో కరణ్ జోహర్ షోలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చిన తనను కూడా తొక్కేయాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ వారి వల్ల ఏమీ కాలేదు. నా ప్రతిభతో నేను నిలబడ్డాను. నటిగా, డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాను. నన్ను ఎవరు ఏం చేయరు. గతంలో నాపై చాలానే కుట్రలు జరిగాయి.అయినా వాటిని నేను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాను అని కంగన చెప్పారు. సుశాంత్ సింగ్ మరణం నేపథ్యంలో మాకు మీ సినిమాలు అవసరం లేదు. మీ నుంచి ఏమి ఆశించడం లేదు. కానీ మేము సినిమాలు తీస్తే వాటిని గుర్తించండి. ప్రశంసించండి. నేను డైరెక్టర్‌ను. నేను తీసిన సూపర్ హిట్ సినిమాలు ఫ్లాప్ అని ఎందుకు ప్రచారం చేస్తారు. నాపై ఆరు కేసులు ఎందుకు పెట్టారు. నన్ను జైలులో పెట్టేందుకు ప్రయత్నించారో చెప్పాలి అని కంగన డిమాండ్ చేశారు.
సుశాంత్ కూడా తప్పు చేశారు. అతని మనస్తత్వం ఆసరాగా తీసుకుని నీవు ప్రతిభావంతుడివి కాదనే కొందరి చెప్పిన వాదనలను సుశాంత్ గుడ్డిగా నమ్మాడు. అలాంటి మాటలతో డిప్రెషన్ కి లోనయ్యాడు. ఇలాంటి కష్టకాలంలో నీవు ఒక్కడివి ఏమీ చేయలేవు అనే తల్లి మాటలు ఆయనపై ప్రభావం చూపాయి. చివరకు కొందరు సుశాంత్ బలహీన మనస్తత్వం కలవాడు అనే చరిత్రను రాయాలనే ఉద్దేశంతో చేసిన కుట్రకు ఆయన బలయ్యాడు అంటూ కంగన రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఓ వర్గం తల్లడిల్లిపోతుంటే.. బాలీవుడ్లో మరో వర్గం అతడి మానసిక స్థితిని తక్కువగా చూపించేందుకు సమాంతరంగా ప్రయత్నాలు చేస్తున్నది. అతడు మానసికంగా బలహీనుడనే ముద్ర వేసే విధంగా మాట్లాడుతున్నారు. మానసికంగా బలహీనుడు కావడం వల్లే డిప్రెషన్‌కు గురై ప్రాణాలు తీసుకొన్నాడనే వెర్షన్ వినిపించడం సరికాదు అని కంగన అన్నారు.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ కొట్టిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానసికంగా బలహీనుడని ఎలా అంటారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌లో ర్యాంక్ సాధించిన వ్యక్తి. అతడి మానసిక స్థితి ఎలా బలహీనం అని డిసైడ్ చేస్తారు. సుశాంత్‌పై ఓ వర్గం చేస్తున్న ప్రచారం సరికాదు అని కంగన రనౌత్ మండిపడింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టులు చూస్తే అతడు ఏమిటో అర్దం అవుతుంది. అతడు తన పోస్టులలో నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. నా సినిమాలు ఆడకపోతే నన్ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారు. దయచేసి నా సినిమాలు చూడండి అంటూ ప్రేక్షకులను ప్రాధేయపడ్డారు. పలు ఇంటర్వ్యూలలో నన్ను ఈ పరిశ్రమ ఎందుకు అక్కున చేర్చుకోవడం లేదంటూ ప్రశ్నించిన విషయాన్ని కంగన తన వీడియోలో వెల్లడించారు.
తన మొదటి సినిమా కాయ్ పో చే నుంచి ఎంఎస్ ధోని లేదా కేదారినాథ్ లేదా చిచ్చేరే వరకు అద్భుతమైన నటన ప్రదర్శించినప్పటికీ ఎందుకు ప్రశంసలు లభించలేదు. చిచ్చోరేకు మంచి ప్రశంసలు లభించినా.. చిచ్చోరేకు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ అవార్డులు ఎందుకు ఇవ్వలేదు. గల్లీబాయ్ లాంటి చెత్త సినిమాలకు అవార్డులు ఎలా ఇస్తారు. అంటూ కంగన రనౌత్ మండిపడ్డారు. సుశాంత్ గురించి గుడ్డిగా రాస్తున్న జర్నలిస్టులపై కూడా కంగన రనౌత్ మండిపడ్డారు. సైక్రియాటిక్ అని, న్యూరోటిక్ అని, అఢిక్ట్ అని రాస్తారు. మీకు సంజయ్ దత్ లాంటి వ్యసన పరులు మీకు కనిపించరా? వాళ్ల వ్యసనాల మీకు అందంగా కనిపిస్తాయా?. నీ పరిస్థితి బాగాలేదు. నీవు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దు అని చెబుతూ ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఎందుకు మాట్లాడుతారు. సుశాంత్‌ది సూసైడ్ కాదు.. మీరు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అంటూ కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.అంటూ కంగన రనౌత్ తన ఆవేదనను ఇస్టాగ్రామ్ లో వీడియో ద్వారా పోస్ట్ చేసింది.
View this post on Instagram













