వాళ్లిద్దరినీ యంగ్ కిడ్స్ అనడం బాగోలేదు … కంగనా
ముక్కుసూటిగా మాట్లాడే కంగన.. మనసుకు నచ్చినట్లు వ్యాఖ్యలు చేసే కంగన రనౌత్ మరోసారి తన నోటికి పని చెప్పింది. ఈ మధ్యే ఆలియాభట్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన కంగన మరో సారి ఆమెపై మరింత ఘాటైన విమర్శలు చెపింది. ఓ ఇంటర్వ్యూలో కంగనను ఎవరో ఒకర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడటం మీకు ఇష్టమా అని అడగ్గా.. నాకు ఏదైనా విషయం నచ్చకపోతేనే స్పందిస్తాను. ఓ వేడుకలో రణ్‌బీర్‌ని యాంగ్ బాయ్ అంటూ సంభోధించారు. ఆలాయ భట్ ఈతరం యంగ్ కిడ్ అట. రణ్‌బీర్‌కు 37, ఆలియాకు 27 ఏళ్ల వయసుంది. ఆలియా వయసుకు మా అమ్మ ముగ్గురు పిల్లల తల్లైంది. వాళ్లిద్దరినీ యంగ్ కిడ్స్ అనడం ఏమాత్రం బాగోలేదు. వాళ్లేమో తమ సరసా సల్లాపాల గురించి మాట్లాడతారు. ఎవరితో రొమాన్స్ చేయాలనుకుంటున్నారో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెడతారు. కానీ దేశం గురించి అడిగితే మాత్రం వ్యక్తిగతం అంటారంటూ కంగన స్పందించింది. మరి కంగన మాటల పట్ల రణ్వీర్, ఆలియా ఏమాంటారో చూడాలి.













