‘కాంచన 3’ ట్రైలర్ విడుదల
దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్ దర్శకత్వం లో నటించిన చిత్రం ‘కాంచన 3’. సినిమా ట్రైలర్‌ను తాజాగా రాఘవ ట్విటర్ వేదికగా విడుదల చేశారు. భయంకరమైన ఇల్లు, అందులోని దెయ్యాల సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. ఈ సినిమాలో రాఘవ తెల్ల జుట్టు, గెడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. విలన్ రాఘవను బెదిరిస్తూ.. ‘నువ్వు నా మాస్ తెలీకుండా మాట్లాడుతున్నావ్’ అంటే.. ఇందుకు రాఘవ.. ‘నువ్వు మాసైతే నేను డబుల్ మాస్’ అని చెబుతున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
హారర్‌కు కామెడీని జోడించి లారెన్స్ చేసిన ప్రయోగానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక అప్పటి నుంచి ఈ చిత్రానికి సీక్వెల్ చేసుకుంటూ వస్తున్నారు లారెన్స్. ఈ సీక్వెల్లో రెండో సినిమాను ‘కాంచన’గా తెరకెక్కించారు. అనంతరం ‘కాంచన 2’గా గంగ వచ్చింది. ఇప్పుడు ‘కాంచన 3’ని లారెన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.













