Kanagana Ranaut: అవన్నీ తెలిసి దేవుడు నన్ను ప్రధానిని చేయడు

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్(Kanagana Ranaut) ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన కంగనా ఓ రీసెంట్ గా తన పొలిటికల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంపీ అయినప్పటికీ తాను రాజకీయాల్లో పూర్తిగా సెటిల్ అవలేదని కంగనా అన్నారు.
పొలిటికల్ ఇండస్ట్రీ చాలా భిన్నమైందని, తాను ఆ నేపథ్యానికి చెందిన వ్యక్తిని కాదని, విమెన్ రైట్స్ పై పోరాడిన తన దృష్టికి ప్రజలు తీసుకొస్తున్న సమస్యలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని, ఎంపీ అయిన తన దగ్గరకొచ్చి ప్రజలు పంచాయితీ స్థాయి సమస్యలను చెప్తున్నారని, వాళ్లు చెప్పే ప్రాబ్లమ్స్ రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలోవని చెప్పినా వారు అర్థం చేసుకోకపోగా మీ సొంత డబ్బును వాడి సమస్యను పరిష్కరించమంటున్నారని కంగనా అసహనం వ్యక్తం చేశారు.
అదే పాడ్‌కాస్ట్ లో మీరు పాలిటిక్స్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలనుకుంటున్నారా? భారత ప్రధాని అవాలనుకుంటున్నారా అని అడగ్గా ప్రధాని పదవికి తాను సరిపోతాననుకోవడం లేదని, తనకు ఆ కోరిక కూడా లేదని కంగనా చెప్పారు. సామాజిక సేవ చేయడం తన నేపథ్యం కాది, పూర్తిగా ప్రజాసేవకే అంకితమయ్యే టైప్ కాదని, ప్రజల కోసం జీవితం మొత్తాన్ని త్యాగం చేసే ఉద్దేశం తనకు లేదని, ఇవన్నీ తెలిసి ఆ దేవుడు తనను ప్రధానిని చేయడని కంగనా చెప్పారు. కంగనా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.