ప్రాజెక్ట్ కెలో కమల్.. అసలు ప్లాన్ అదే!
సినిమా అనౌన్స్ చేసినప్పుడే భారీ క్రేజ్ అందుకున్న ప్రాజెక్ట్ కె మూవీలో కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడని తెలిసినప్పుడు ఆ సినిమా హైప్ ఆకాశాన్నంటింది. మూవీ టీమ్ అఫీషియల్ గా చెప్పకపోయినా లీకైన సోర్స్ నమ్మదగింది కావడంతో పదిరోజుల క్రితమే ఈ న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ప్రాజెక్ట్ కె కోసం కమల్ హాసన్ ఆగస్ట్ నుంచి 30 రోజుల కాల్షీట్స్ నాగ్ అశ్విన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. సింగిల్ షెడ్యూల్లోనే నాగ్ అశ్విన్ కమల్ కు సంబంధించిన షూట్ ను కంప్లీట్ చేసే దిశగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ 30 రోజుల కోసం కమల్ 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ కమల్ తప్ప మరెవరూ చేయలేరని నాగ్ అశ్విన్ ఇంత పెద్ద మొత్తం రెమ్యనరేషన్ ఇవ్వడానికి కూడా ఓకే అనేశాడట.
అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమాకు కమల్ ను తీసుకోవడం వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందట. తమిళనాడులో బాహుబలి తప్ప మరే తెలుగు డబ్బింగ్ సినిమా నెంబర్ వన్ గా నిలిచింది లేదు. ప్రాజెక్ట్ కె లో కమల్ ని జాయిన్ చేసుకుంటే ఉన్న క్రేజ్ కు అది ట్రిపుల్ అవడం ఖాయం. దాని వల్ల ఇప్పుడిస్తున్న పెద్ద మొత్తం వైజయంతి సంస్థకు ఈజీగా రికవర్ అయిపోతుంది.
బాలీవుడ్ నుంచి అమితాబ్, దీపికా పడుకొనా, దిశా పటానీ, అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు కాబట్టి నార్త్ మార్కెట్, బిజినెస్ ఈజీగా అవుతుంది. వీటిన్నింటికీ ప్రభాస్ ఇమేజ్ కూడా తోడవుతుంది కాబట్టి ప్రాజెక్ట్ కె కు కమల్ కు తోడయితే వారి కాంబినేషన్ మెంటల్ మాస్ కాంబినేషన్ అవడం ఖాయం.













