కల్కిలో కమల్ ఎంతసేపు కనిపిస్తాడంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898ఏడీ సినిమా రిలీజ్ దగ్గరపడుతుంది. ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఎలక్షన్స్ హడావిడి తగ్గిన నుంచి సరైన సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్లు తిరిగి కళకళలాడాలంటే ఆ సత్తా కల్కికి మాత్రమే ఉందని అందరూ బలంగా నమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో లోక నాయకుండు కమల్ హాసన్ నటిస్తుండటంతో కోలీవుడ్ లో ఈ సినిమాపై కాస్త ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాలో కమల్ పాత్ర నిడివి ఎంతనేది ఇప్పటికీ అఫీషియల్ గా తెలియలేదు. కల్కిలో తనది క్యామియో అని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కమల్ చెప్పుకున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కల్కి మొదటి భాగంలో కమల కనిపించేది జస్ట్ 20 నిమిషాలేనట.
సెకండ్ పార్ట్ లో సుమారు 90 నిమిషాల పాటూ ఉంటాడని తెలుస్తోంది. అంటే మొదటి భాగంలో జస్ట్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసి కమల్ విశ్వరూపాన్ని సెకండ్ పార్ట్ లో చూపించనున్నారన్నమాట. కాబట్టి కల్కి ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్- కమల్ మధ్య ఎక్కువ సీన్స్ ఉండవనేది ఫ్యాన్స్ ముందే ప్రిపేర్ అయితే బెటర్. ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక కల్కి ప్రమోషన్స్ ను వేగవంతం చేయనుంది చిత్ర యూనిట్.













