కల్కి కోసం కమల్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడంటే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898ఏడి. ఈ సినిమాలో క్యాస్టింగ్ చాలా భారీగా ఉంది. హీరోయిన్ గా దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ కల్కిలో విలన్ గా నటిస్తున్నాడు.
కల్కి సినిమా మొత్తానికి కమల్ హాసన్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు. అంతేకాదు ప్రభాస్, కమల్ ఆన్ స్క్రీన్ ఫైట్ సినిమా మొత్తానికే ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఈ సినిమాలో కమల్ పాత్ర ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్గా నటించడం వల్ల సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బజ్ కూడా వచ్చింది.
అయితే ఈ సినిమాలో విలన్ గా నటించడానికి కమల్ హాసన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రూ.500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న కల్కి సినిమాలో కమల్ కు భారీ మొత్తంలోనే తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం కమల్ ఏకంగా రూ.60 నుంచి రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













