ఫిబ్రవరి 21న పార్టీ ప్రకటన
తమిళనాడులోని రామనాథపురంలో ఫిబ్రవరి 21న తన రాజకీయ పార్టీ పేరును కమల్ హాసన్ ప్రకటించనున్నారు. అదే రోజు రాష్ట్ర పర్యటనకు కూడా ప్రారంభిస్తారు. పర్యటన వివిధ దశల్లో జరుగుతుంది. రామనాథపురం ఆయన స్వస్థలం. అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధురై, దిండిగల్, శివగంగై జిల్లాలోని ప్రజలతో మమేకం కానున్నారు. గత సంవత్సరం రాజకీయాలోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పర్యటన ప్రారంభమైన సందర్భంగా రాజకీయ పార్టీ పేరుతో పాటు మార్గదర్శక సూత్రాలను ప్రకటిస్తానని కమల్ పేర్కొన్నారు.













