ఇండియన్-2 ఫస్ట్‌లుక్ విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా భారతీయుడు-2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ శంకర్ విడుదల చేశారు. భారతీయుడు-2 సినిమాను గతేడాది కన్ఫర్మ్ చేసినప్పటికీ కమల్‌హాసన్ రాజకీయాలతో, అటు శంకర్ రోబో-2 సినిమాతో బిజీగా ఉండటంతో సినిమా ఆలస్యం అయింది. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తోన్న ఇండియన్-2 సినిమా జనవరి 18న సెట్స్‌పైకి వెళ్లనుంది. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్టర్లో కనిపిస్తోంది. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. భారతీయుడుకు సీక్వెల్‌గా లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.













