మరో వివాదంలో కమల్
కమల్‌హాసన్‌ని వివాదాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అతని ప్రమేయం లేకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు. కొన్ని మాత్రం అతని నోటి దురుసు వల్ల వచ్చి పడుతుంటాయి. తను చేస్తున్న సినిమాల విషయం కావచ్చు, సామాజిక అంశం కావచ్చు.. ఇప్పటివరకు ఎన్నో వివాదాలను కొని తెచ్చుకున్నాడు కమల్. తాజాగా అలాంటి ఓ వ్యాఖ్య చేసి కొందరి ఆగ్రహానికి గురవుతున్నారు కమల్. విజయ్ సేతుపతితో కలిసి ఓ యూ ట్యూబ్ ఛానల్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘రాముడ్ని స్తుతిస్తూ బిచ్చమెత్తుకునేవాడు’ అంటూ త్యాగరాజ స్వామిని ఉద్దేశించి కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. త్యాగరాజ స్వామిని దేవుడిగా కొలిచే కర్ణాటక సంగీత విధ్వాంసులు కమల్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదాం ఎక్కడి వరకు వెళ్తుందో… దీనికి కమల్ ఏం సమాధానం చెప్తాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.













