అభిమానులు! క్షమాపణలు చెబుతున్నా..కరుణానిధి నా అభిమాన నాయకుడు : కమల్ హాసన్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ రూపొందిన తాజా చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’. ఈ సినిమా జూన్ 3న థియేటర్ల ముందుకు రానుండగా.. ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్‌పై లోకనాయకుడు సందడి చేసేందుకు సిద్ధం అవడంతో ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ, మాస్టర్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో కమల్‌హాసన్ ‘విక్రమ్’ మూవీలో నటించారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. వెర్సటైల్ స్టార్ సూర్య అతిథి పాత్రలో నటించారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ‘నా చివరి చిత్రం రిలీజ్ నాలుగేళ్లు అయింది. ఇందుకు అభిమానులు క్షమాపణలు చెబుతున్నా. నేను సంపాదించింది అంతా మళ్లీ ఇండస్ట్రీలోనే పెడుతున్నా. ఇక నుంచి ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడతా. యాధృచ్ఛికంగా మాజీ సీఎం కరుణానిధి జయంతి జూన్ 3న ‘విక్రమ్’ విడుదల అవుతోంది. ఆయన నా అభిమాన నాయకుడు..’ అని కమల్ హాసన్ తెలిపారు. ఈ సందర్భంగా 600 సినిమాలకు పీఆర్ఓగా వర్క్ చేసిన డైమాండ్ బాబును ఆయన సత్కరించారు. ఇప్పటికే విడుదలైన ‘విక్రమ్’ మూవీ ట్రైలర్‌తో ఫ్యాన్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. 173 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌ను మూవీ మేకర్స్ ఇప్పటికే సిద్ధం చేశారు. ఇటీవలె ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొని అభిమానులకు కమల్ హాసన్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కమల్ హాసన్ ‘విక్రమ్’ ఫస్ట్ సింగల్ ‘మత్తుగా మత్తుగా’ లిరికల్ వీడియో
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ‘విక్రమ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ ‘మత్తుగా మత్తుగా’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాట ని మాస్, గ్రూవీ సాంగ్ గా డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించేలా వుంది. ఈ పాటలో కమల్ హాసన్ డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ముఖ్యంగా తలపై షర్టు కప్పుకొని కమల్ హాసన్ చేసిన మాస్ డ్యాన్స్ ప్రేక్షకులని అలరిస్తుంది. కమల్ హాసన్ ఈ పాటని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే స్టార్ హీరో సూర్య ఈ చిత్రంలో గెస్ట్ లో అలరించబోతున్నారు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రధాన తారణంతో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్ 3న ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది.













