కమల్ యూ టర్న్ ?
జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కమల్‌హాసన్ నటన గురించి ఇవాళ మనం కొత్తగా చెప్పే పనిలేదు. ఎన్నో అద్భుత పాత్రల్లో జీవించిన కమల్ ఈ మధ్యే కాస్త సినిమాల విషయంలో వివాదాల్లో పడ్డాడు. అటు సక్సెస్ రేటు తగ్గడంతో అవకాశాలు రాలేదు. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన విశ్వరూపం సినిమా పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం దానికి సీక్వెల్‌ని విడుదల చేసే పనిలో పడ్డాడు. మరోవైపు కమల్ ప్రాంతీయ పార్టీని కూడా సొంతంగా స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీ, కమల్‌లు సినిమాలకు దూరం అయి రాజకీయాల్లోనే బిజీ అవుతురంటూ ప్రచారం జరుగుతోంది. ఇక రజనీకాంత్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా కూడా ఆయన పొలిటికల్‌గా ఎంట్రీ విషయంలో అయోమయంగా వున్నాడు. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో బిజీగా మారడం కోసం సినిమాలు వదులుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కమల్‌హాసన్ రెస్పాండ్ అయ్యాడు. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్న కూడా సినిమాలు చేయడం మాత్రం ఆపను అని చెప్పేశాడు. దాంతో ఒక్కసారిగా కమల్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. నిజమే, అలాంటి గొప్ప నటుడు ఇక సినిమాలు చేయనంటే ఎవరికైనా నిరాశే కదా? కమల్ తాజాగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు -2లో నటించేందుకు రెడీ అయ్యాడు.













