సూర్యకు ప్రేమతో 62 లక్షల రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన కమల్ హాసన్
కమల్ హాసన్ తాజాగా సూర్యకు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. తాను పోషించిన రోలెక్స్ పాత్రకు తగ్గట్టుగానే రోలెక్స్ వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. కమల్ హాసన్. తా జాగా సూర్యకు తాను పోషించిన రోలెక్స్ పాత్ర కు తగ్గట్టుగా రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ ఇచ్చాడు. విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కమల్ హాసన్ ఫుల్ ఖుషీ మీదున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు అంతా కూడా మూడు రోజుల్లోనే వచ్చింది. విక్రమ్ సినిమా కమల్ హాసన్‌కు లాభాల పంట పండిస్తోంది. అందుకే కమల్ హాసన్ గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్నాడు. నిన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు కాస్ట్ లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక ఇప్పుడు సూర్యకు విలువైన బహుమతిని ఇచ్చాడు.సూర్య చేతికి ఉన్న ఈ వాచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఏ మోడల్, ధర ఎంత అయి ఉంటుందని అందరూ వెతుకుతున్నారు. ఇది మోడల్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు 62 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
మొత్తానికి సూర్యకు మాత్రం ఇలా తన ప్రేమను వ్యక్త పరిచాడు కమల్ హాసన్. నిన్న ఓ వీడియోను రిలీజ్ చేసిన కమల్ హాసన్.. అందులోనూ సూర్య గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాడు. చివరి మూడు నిమిషాలు దడదడలాడించేశాడని, తన మీద ప్రేమతోనే ఈ రోల్ చేశాడంటూ సూర్య గురించి కమల్ హాసన్ ఎంతో గొప్పగా చెప్పేశాడు. ఇక వచ్చే సినిమాలో తామిద్దరం కలిసి నటించబోతోన్నట్టు ప్రకటించేశాడు. మొత్తానికి విక్రమ్ సినిమా కోసం అయితే సూర్య రెమ్యూనరేషన్ తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. కానీ కమల్ హాసన్ మాత్రం ఇలా బహుమతి రూపేణా సూర్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చేశాడు.
https://twitter.com/Suriya_













