లోకేశ్ కనగరాజ్‌కు కమల్ హాసన్ కారు గిఫ్ట్ : మాస్టర్ కాంబి లో లోకేశ్ కనగరాజ్ హీరోయిన్ సమంత
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. విడుదలైన తొలి రోజే రూ. 45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ నిన్నటితో(జూన్ 6న) రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది.వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 పైగా కోట్లు అందుకుంది. వీకెండ్లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇక నేటితో ఈమూవీ సుమారుగా రూ. 200 కోట్లకు చేరువ కానుందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు.
ఇదిలా విక్రమ్ మూవీ భారీ విజయం అందుకోవడంతో కమల్ హాసన్ డైరెక్టర్‌కు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన లెక్సాస్ లగ్జరీ కారును డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు, కమల్ బహుమతిగా అందించాడు. కమల్ హాసన్ కారు కీని డైరెక్టర్‌కు అందిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ కారు ధర సుమారు రూ. 59.50 లక్షల నుంచి రూ. కోటీకి పైగా ఉంటుందని అంచన. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం.
‘మాస్టర్’ కాంబి లో సమంత హీరోయిన్
విక్రమ్ తో కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఆయన మేకింగ్‌కి ఒక్క కోలీవుడ్ మాత్రమే కాదు.. టోటల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తో తన సినిమాల్లో హీరోలకు అప్లై చేస్తూ ప్రతీసారీ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాడు లోకేష్ కనగరాజ్. ఖైదీతో కార్తికి మాస్టర్ తో విజయ్ కు బ్లాక్ బస్టర్ రిపీట్ చేశాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడు కమల్‌కు కూడా సూపర్ హిట్ అందించాడు. ఇక తన తర్వాతి సినిమా మాత్రం వీటన్నిటికి మించిన బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. ఆయన తదుపరి చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ కావడంతో.. రాబోయే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే మంచి స్క్రిప్ట్ రేడీ చేశాడట లోకేష్. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయని చెబుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లోకి లెడీ సూపర్ స్టార్ సమంత అడుగుపెడుతోందని సమాచారం.ఈసారి హీరోతో పాటు హీరోయిన్ కు కూడా యాక్షన్స్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ లోకేష్. అందుకే లేడీ సూపర్ స్టార్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట.విజయ్, సమంత కలసి నటించిన ప్రతీసారి కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ను అందుకుంది.కత్తి, తేరీ, మెర్సల్ మూవీస్ లో ఈ కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది.ఇప్పుడు మరోసారి హిట్ పెయిర్ ను రిపీట్ చేసేందుకు లోకేష్ ట్రై చేస్తున్నాడు.













