నేను కూడా వస్తున్నా!
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తమ విలవైన ఓట్లను అంగట్లో సరుకుల్లా అమ్ముకుని ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని మిగిల్చారని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ త్వీవస్థాయిలో విమర్శించారు. తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని, ఇక వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఓ తమిళ వారపత్రికలో ధారావాహికగా రాస్తున్న వ్యాసంలో ఆర్కే నగర్ నియోజకవర్గం ఓటర్లపై కమల్ విమర్శల వర్షం కురిపించారు. నగదు బట్వాడా ఆరోపణలతో ఒకసారి రద్దయిన ఆ నియోజకవర్గం ఎన్నికలు మళ్లీ జరిగినా దృశ్యాలు, వర్గాలు మారినా తీరు మాత్రం మారలేదన్నారు. ఒక్కో ఓటకు అధికార పార్టీ రూ.6వేల, స్వతంత్ర అభ్యర్థి తరపున రూ.20వేల ధర నిర్ణయించారన్నారు. ఈ పోటీలో తమ తలకు అధిక వెల ప్రకటించిన ఇండిపెండెంట్ అభ్యర్థే, తమ కష్టాలను కొని తెచ్చుకున్నారని కమల్ పేర్కొన్నారు. ఆర్కే నగర్ ఓటర్లు రూ.20 టోకెన్లకు అమ్ముడు పోయారని, ఇది భిక్షమెత్తడం వంటిదేనని, ఇంతటి నీచమైన సంఘటన మరెక్కడైనా చూడగలమా అంటూ విరుచుకుపడ్డారు.













