రాజకీయాలకు కమల్ గుడ్ బై?

విశ్వనటుడు కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ గట్టి ఎదురు దెబ్బ తలిగింది. కమల్ కూడా ఓడిపోవడంతో పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో నైరాశ్యం నెలకొంది. దీనికి తోడు పార్టీకి చెందిన పలువురు నేతలు పదవులకు నుంచి వైదొలగుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ సైతం తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా కమల్ పార్టీ పట్ల ప్రజల్లో అంతగా ఆసక్తి లేకపోవడం, ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం, తాను వ్యతిరేకించే భావజాల పార్టీలు అధికారానికి దూరం కావడం తదితర కారణాల నేపథ్యంలో కమల్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కమల్ రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారా? అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ మేరకు కమల్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.