పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కమల్‌హాసన్‌తో లోకేష్ కనకరాజ్ కొత్త సినిమా!
తమిళ్లో మానగరం పేరుతో రూపొందిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా నగరం పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత కార్తీతో చేసిన ఖైదీ తమిళ్లో, తెలుగులో ఘనవిజయం సాధించింది. కొత్త కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్‌గణ్‌తో రీమేక్ చేయబోతున్నారు. హిందీ వెర్షన్‌కి కూడా లోకేష్ డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. లోకేష్ టాలెంట్‌ను గుర్తించిన తమిళ్ స్టార్ హీరో విజయ్ అతనితో వెంటనే సినిమా స్టార్ట్ చేశాడు. మాస్టర్ పేరుతో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈలోగా లాక్డౌన్ రావడంతో రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడీ దర్శకుడితో లోకనాయకుడు కమల్‌హాసన్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
కమల్ సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బేనర్లో ఈ సినిమా రూపొందనుంది. ఇది ఈ బేనర్లో నిర్మించనున్న 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో రజనీకాంత్ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో కూడిన అధికారిక ప్రకటన ఇటీవల వచ్చింది. ఇది కమల్‌హాసన్ నటించే 232వ సినిమా. ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఫ్రీ లుక్ ను చాలా గమ్మత్తుగా డిజైన్ చేసింది చిత్రబృందం. ‘ఒకానొక సమయంలో అక్కడ ఒక దెయ్యం నివసించేది..’ అనే అర్థం వచ్చేలా ఉండి ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్‌లుక్‌ని చూస్తే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.













