కమల్-రజినీ కలుసుకున్న వేళ..
కోలీవుడ్ సీనియర్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్ ఒకప్పుడు కలిసి సినిమాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. బాలచందర్, భారతి రాజా లాంటి డైరెక్టర్లతో వారు చేసిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. ఒకరు యాక్టింగ్‌లో పండితుడు కాగా, మరొకరు స్టైల్ లో పండితుడు అయ్యాయి. మొత్తానికి ఇద్దరూ కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు.
వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో స్నేహం ఉంది. వారిద్దరూ ఎక్కడ ఎప్పుడు కలిసినా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. అలాంటి రజినీకాంత్, కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత అనుకోకుండా కలుసుకున్నాడు. ప్రస్తుతం రజినీ170 సినిమా చేస్తున్నాడు. కమల్ హాసన్ ఇండియన్2 సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకే దగ్గర జరుగుతుండటంతో షూట్ గ్యాప్ లో రజినీ, కమల్ కలుసుకుని, వారి సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటూ పిచ్చాపాటి కూడా మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ లైకా సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు హీరోలు రీసెంట్ గా తమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.













