బాలయ్య విషయంలో కళ్యాణ్ రామ్ మౌనమెందుకు?
బాక్సీఫీస్ దగ్గర దసరా బ్లాక్ బస్టర్ గా భగవంత్ కేసరి ఇప్పటికే దూసుకెళ్తుంది. ఈ జోరు మరో వారం రోజులు కనీసం ఉండేలా ఉంది. ఇప్పటికే 55% వరకు రికవరీ చేసుకున్న భగవంత్ కేసరి బ్యాలెన్స్ మరో వారంలో ఈజీగా వసూలు చేయగలదు. ఈ సినిమా కథ పరంగా కొత్తగా లేకపోయినప్పటికీ, తండ్రి కాని తండ్రి సెంటిమెంట్ ను అనిల్ రావిపూడి హ్యాండిల్ చేసిన విధానం కొత్తగా ఉంది.
దానికి తోడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే మెసేజ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. దసరా బరిలో రిలీజైన లియో, టైగర్ నాగేశ్వరరావు లకు ధీటుగా భగవంత్ కేసరి నిలబడి బాక్సాఫీస్ వద్ద మంచి మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇంతటి ఘన విజయం సాధించిన భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ స్పందించకపోవడం పై ఫ్యాన్స్ లో పలు రకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి.
బాలయ్య ఏదైనా పెద్ద హిట్ కొడితే కళ్యాణ్ రామ్ రియాక్ట్ అవడం ఇప్పటికి చాలా సార్లు జరిగింది. రీసెంట్గా అఖండ, వీర సింహారెడ్డి సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ స్పందించాడు. కానీ ఇప్పుడు భగవంత్ కేసరి విషయంలో మాత్రం కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తన డెవిల్ సినిమా ప్రమోషన్ల విషయంలో మాత్రం కళ్యాణ్ రామ్ యాక్టివ్ గానే ఉంటున్నాడు. ఈ ప్రశ్నలన్నింటికీ డెవిల్ ప్రమోషన్లలో కళ్యాణ్ రామ్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి మరి.













