ఎదురీత టీజర్ విడుదల చేసిన కల్యాణ్ రామ్
శ్రావణ్ రాఘవేంద్ర, లియోనా లిషాయ్ జంటగా నటించిన చిత్రం ఎదురీత. బాలమురుగన్ దర్శకుడు. బోగారి లక్ష్మీనారాయణ నిర్మాత. హైదరాబాద్‌లో టీజర్ విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ టీజర్‌ను విడుదల చేసిన కల్యాణ్‌రామ్‌కి ధన్యవాదాలు. ప్రేక్షకులకి నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. నిర్మాత మాట్లాడుతూ త్వరలోనే ఆడియోని, సినిమాని విడుదల చేస్తామన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ తండ్రీకొడుకుల మధ్యనుండే భావోద్వేగాలే ఈ కథకు కీలకం. లియోనా నటన కన్నీళ్లు తెప్పిస్తుందన్నారు. జియా శర్మ, భద్రం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.













