చిరంజీవి అల్లుడు అవయవదానం
చిరంజీవి అల్లుడు, కథానాయకుడు కల్యాణ్‌దేవ్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అవయవదాన ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. కల్యాణ్ మాట్లాడుతూ మన అవయవాలు దానం చేయడం కోసం మన సమ్మతిని తెలపడానికి ఒక్క నిమిషం చాలు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి కుటుంబ సభ్యులు, స్నేహితులకి చెబితే వాళ్లు మనం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడమే కాకుండా, సంతోషిస్తారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఎవరం ఏమీ తీసుకెళ్లలేం. అవయవదాన యజ్ఞంలో అందరూ భాగం కావాలన్నారు. కల్యాణ్ రెండో చిత్రాన్ని పులివాసు దర్శకత్వంలో చేయనున్నారు.













