కల్కి సాంగ్కు ఫిదా అవడం ఖాయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. కల్కి నుంచి ఇక మీదట వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా అంచనాలను పెంచేలా టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్కి నుంచి రిలీజైన టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక సాంగ్స్ తో కల్కి సినిమా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్, వాటి మేకింగ్, కొరియోగ్రఫీ అన్నీ కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అండర్ వాటర్ లో ఇప్పటివరకు థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ మాత్రమే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఓ సాంగ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఆ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. యూరప్ లో షూట్ చేసిన ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కానుందని, ఈ సాంగ్ లో సముద్రపు లోతుల్లోని అందాలను అద్భుతంగా చూపించనున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ లో దిశా గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని సమాచారం.













