సెన్సార్ పూర్తైన కల్కి
గరుడవేగ చిత్రం తరువాత రాజశేఖర్ పోలీస్ యూనిఫాంతో చేస్తోన్న చిత్రం కల్కి. ప్రశాంత్‌శర్మ దర్శకత్వంలో శివాని శివాత్మిక, వైట్ లాంబ్ టాకీస్ వినోద్‌కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ చిత్రాన్ని నిర్మించారు. కల్కి చిత్రం సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ సాధించింది. ఇప్పటికే విడుదలైన మోషన్‌పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్, హాసెస్ట్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్, వాల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు పెంచాయి. ఆదాశర్మ, నందితా శ్వేత పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ ఇతర తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.













