28న వస్తున్నాడు….కల్కి
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం కల్కి. ప్రశాంత్ వర్మ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ పక్కా వాణిజ్య చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం. శ్రవణ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతానికీ ప్రాధాన్యం ఉందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇండియా పాక్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటుందో ఈ సినిమా అలానే ఉంటుంది. ప్రతి పాత్ర, సన్నివేశం కథలో భాగంగానే వస్తాయన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర్‌గారి ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే కొత్త తరహాలో సాగే సినిమా ఇది. దర్శకుడు ఈ కథని చక్కగా తీర్చిదిద్దారన్నారు. అదాశర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా తదితరులు నటించారు.













