Kalki Koechlin: బాలీవుడ్ సంక్షోభంలో ఉంది
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) ఎక్స్ వైఫ్ కల్కి కొచ్లిన్(kalki koechlin) ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అనురాగ్ నుంచి విడిపోయి బాలీవుడ్ నటిగా కెరీర్ లో ముందుకెళ్తున్న కల్కి జిందగీ నా మిలేగీ దోబారా, యే జవానీ హై దీవానీ, గల్లీ బాయ్ లాంటి సినిమాల్లో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
తాజాగా కల్కి కొచ్లిన్ బాలీవుడ్ గురించి సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. రీసెంట్ గా అలీనా డిస్సెక్ట్స్ పాడ్కాస్ట్ లో మాట్లాడిన కల్కి, హిందీ చిత్ర పరిశ్రమ ఆర్ధిక మాంద్యంలోకి జారుకుంటుందని సంచలన కామెంట్స్ చేయగా, ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఆర్థిక మాంద్యం జరుగుతుందని, అందుకే ప్రతీ సినిమానీ రీరిలీజ్ చేస్తున్నరని, ఈ ఆర్థిక మాంద్యం గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసినప్పటికీ దాన్ని పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, అయితే బాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి కారణం కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోవడమేనని కల్కి వెల్లడించింది.






