కల్కి క్లైమాక్స్.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి. భారీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూపించని ఓ సరికొత్త ఫ్యూచర్ వరల్డ్ ను కల్కిలో చూపించబోతున్నాడట.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. కల్కి క్లైమాక్స్ ఇండియా మూవీ హిస్టరీలో మునుపెన్నడూ లేని విధంగా ఉండనుందట. కల్కి క్లైమాక్స్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఉంటారని, అంటే సినిమాలో నటిస్తున్న స్టార్ క్యాస్ట్ అంతా పాల్గొననుందన్నమాట. వచ్చే వారం నుంచి ఈ సినిమా క్లైమాక్స్ కు షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్లైమాక్స్ షూటింగ్ లో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్, దీపికా, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండతో పాటూ మరికొందరు పాల్గొననున్నారట. రెండు భాగాలుగా రాబోతున్న కల్కి ఫస్ట్ పార్ట్ లో కమల్ హాసన్ క్యారెక్టర్ క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుందని, పార్ట్ 2 లో వీరద్దరి మధ్య అసలైన యుద్ధం జరగనుందని టాక్. మే 9న కల్కి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.













