కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
మరో 20 రోజుల్లో కల్కి 2898ఏడి సినిమా ఫీవర్ మొదలుకానుంది. జూన్ 10న ట్రైలర్ రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ హైప్ మాత్రం బాహుబలి తరహాలో లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ రాబోయే రెండు వారాల్లో ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ పెరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ తో నిర్మాత అశ్వినీదత్ చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్, చంద్రబాబు ఇద్దరూ తనకు దగ్గర వ్యక్తులే కావడంతో కల్కి సినిమాకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పర్మిషన్లు వచ్చేస్తాయి. విదేశాల్లో ఇప్పటికే కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఒక్కరోజులోనే దాదాపు 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు మరో మూడు వారాలుండటంతో ఈజీగా ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని బయ్యర్లు ధీమాగా ఉన్నారు.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారమైతే కల్కి 116 లొకేషన్లకు సంబంధించిన బుకింగ్స్ జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 20 తర్వాత ఎప్పుడైనా కల్కి బుకింగ్స్ స్టార్ట్ అవొచ్చు. ప్రభాస్ చేస్తున్న ఫాంటసీ సినిమా కావడం, ఆ క్రేజ్ చూస్తుంటే కచ్ఛితంగా టికెట్ బుకింగ్ యాప్స్ క్రాష్ అయ్యే అవకాశముంటుందన్నారు. ట్రైలర్ రిలీజ్ నుంచి కల్కికి సంబంధించిన ప్రమోషన్స్ ను ఒక్కసారిగా వేగవంతం చేయనున్నారట మేకర్స్.













