Kalivi Vanam: ఈ నెల 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “కలివి వనం”.
“కలివి వనం” (Kalivi Vanam) సినిమా చూసిన వారందరూ ఒక కొత్త అనుభూతి కి లోనవుతారు.. సీనియర్ నటుడు రఘు బాబు
వీకెండ్స్ రాగానే ప్రకృతిని ఆస్వాదించడం కోసం మనం ఫారెస్ట్ కి గాని, రిసార్ట్ కి గాని వెళ్తున్నాం. కానీ..మీరు ఈ వీకెండ్ లో మా “కలివి వనం” సినిమాకి వస్తే.. ఒక ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎటువంటి అనుభూతి పొందుతారో మా సినిమా చూస్తే అదే అనుభూతిని మీరు కచ్చితంగా పొందుతారు.వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది. కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నెల 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో నటులు రఘుబాబు, బిత్తిరి సత్తి గారు, సమెట గాంధీ గారు, హీరోయిన్ నాగదుర్గ, అమృతం సీరియల్ డైరెక్టర్ హరిచరణ్ తదితరు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం
సీనియర్ నటులు రఘుబాబు మాట్లాడుతూ.. పూర్తిగా ఎన్విరాన్మెంటల్ బేస్డ్ గా తీసిన సినిమా ‘కలివి వనం’.ప్రొడ్యూసర్స్ శ్రీ మల్లికార్జున రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ గారు రాజు నరేంద్ర వీరందరి వ్యాపారాలు వేరు.వీరికి సినిమా ఫీల్డ్ కి టచ్ చేయలేదు. అయినా సినిమాను చాలా అద్భుతంగా తీశారు. మదీన్ ఎస్.కె సాంగ్స్ మ్యూజిక్ లో వస్తున్న సాంగ్స్ చాలా ఎక్స్ట్రాడినర్ గా అద్భుతంగా ఉన్నాయి. అలాగే డిఓపి బాబు కెమెరా విజువలైజేషన్ చాలా బ్యూటిఫుల్ గాఉన్నాయి.ఈ సినిమా చూస్తుంటే కొత్త వాళ్ళు తీసినట్లు అనిపించదు . చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు తీసినట్టుగా ఉంది. యూట్యూబ్ స్టార్ అయిన నాగ దుర్గ ఇందులో చాలా బాగా నటించింది. క్లాసికల్ కి, ఫోక్ కి, వెస్ట్రన్ కి మూడు వేరియేషన్స్ డ్యాన్స్ తో అద్భుతంగా చేసింది. ఇందులో నేను ఒక ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో నటించిన వారందరూ కూడా చాలా బాగా నటించారు. ఆలాగే చిన్న పిల్లలు కూడా అద్భుతంగా చేశారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను పెద్ద విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నటుడు బిత్తిరి సత్తి మాట్లాడుతూ…కొత్త నిర్మాతలతో కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమా చాలా పెద్ద సినిమాగా మారనుంది. మాలాంటి వారందరినీ సెలెక్ట్ చేసుకుని తీసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా వెనుక దర్శక నిర్మాతలది ఎంత కష్టం ఉందనేది వారికి మాత్రమే తెలుసు. కానీ వెండి తెరపై చూసే ప్రేక్షకుల మాత్రము ఈ సినిమా ద్వారా కొత్త అనుభూతికి లోనయ్యేలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా కోసం టెక్నీషియన్లు అందరు కూడా చాలా కష్టపడి పనిచేశారు అలాగే ఇందులో సీనియర్ నటులు రఘు బాబు గారితో నా సమ్మెట గాంధీ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా చెల్లెలు లాంటి నాగదుర్గ ఇందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. బాబన్న కెమెరా వరకు మదీన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది ఈనెల 21నందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించి దస్తిక నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చిత్ర దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ.. సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అని కూడా తెలియపరుస్తూ ఒక విలేజ్ డ్రామా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం.మీరు సినిమా చూసి బయటకి వచ్చిన తరువాత మీలో కూడా ఒక మొక్కను నాటాలన్నటువంటి ఆలోచన మీ మైండ్ లోకి వస్తుంది. మొక్కను చూస్తే మొక్కాలే కానీ కొట్టేయొద్దని ఆలోచన మీ మైండ్ లోకి వస్తుంది. అదే మా నినాదం. పిల్లలకి మన ప్రకృతి గురించి, ప్రకృతి అనుబంధం గురించి, ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని చిన్నప్పుడు నుండే వాళ్ళ మెదళ్ళలో నాటితే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదై మహా వృక్షం అవుతుంది. అందుకే చిన్నప్పుడే వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ సినిమా తీయడం జరిగింది. మంచి ఉద్దేశంతో తీసిన ‘కలివి వనం’ సినిమా 100కు పైగా థియేటర్లలో వస్తుంది. వచ్చి చూడండి ఒక మంచి సినిమాను చూసినటువంటి అనుభూతి మీరు పొందుతారు.ఈ సినిమా మీకు నచ్చితే 10 మందికి చెప్పండి అని అన్నారు.
సీరియల్ డైరెక్టర్ హరి చరణ్ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలు ఎంచుకున్న కథ నాకు చాలా కనెక్ట్ అయ్యింది. అలాగే ఈ సినిమాకు దర్శకనిర్మాతలు మంచి సీనియర్ నటులను సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో నాగదుర్గ హీరోయిన్గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ద్వారా చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చిత్ర నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. మా చిత్ర,,దర్శక నిర్మాతలు మల్లికార్జున్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు డబ్బులకు ఎక్కడా వెనకాడకుండా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో, అడవుల్లో రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చిత్రీకరణ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా చిన్న సినిమా కాదండి చాలా పెద్ద సినిమా. మీడియా వారంతా మా కలివి వనం సినిమాను ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను
మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్ అన్నకు, ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డికి ధన్యవాదములు అన్నారు.
హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ.. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమాకు వచ్చిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.ఈ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత మొక్కను చూస్తే చేతులెత్తి నమస్కరిస్తారు.. అలాంటి ఒక గొప్ప మూవీ ఇది. ఒక తెలుగు అమ్మాయి అయిన నేను ఒక మంచి మూవీ తో ఒక అద్భుతమైన స్టోరీతోని లాంచింగ్ ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్న నాకు ఈ కథ విన్న తరువాత ఇంతకన్నా బెస్ట్ స్టోరీ ఇంకోటి వస్తుందో లేదో అనిపించింది.ఇలాంటి మంచి సినిమాలో హరిత అనే క్యారెక్టర్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న దర్శక నిర్మాతలకు చాలా రుణపడి ఉంటాను. కెమెరామెన్ బాబు ఫుల్ సపోర్ట్ చేశారు. మదిన మ్యూజిక్ నాకు సినిమా ద్వారా ఇంకా మంచి పేరు వస్తుంది. అలాగే సీనియర్ నటులు రఘుబాబు గారు బిత్రి సత్తన్న ఇలా పెద్దల నటలతో స్కీం షేర్ చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. వీరందరూ నన్ను కొత్త అమ్మాయిగా చూడకుండా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈనెల 21న ప్రేక్షకుల మందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆస్వాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెద్దలు సినిమా పెద్ద ఘనవిజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.






