అది మాత్రం చెప్పను.. కాజల్
కాజల్ ప్రస్తుతం సంచలన విజయం సాధించిన భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2లో నటిస్తుంది. తొలిసారి కమల్ సరసన కథానాయికగా సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆమె వృద్ధురాలిగా కనిపించనుందట. అయితే ఆ వృద్ధురాలి వయసు మాత్రం చెప్పనని అంటోంది కాజల్. ఇందులో నేను యుద్ధ కళలు, స్వీయ రక్షణ కళలు తెలిసిన అమ్మాయిగా కనిపిస్తాను. కానీ నా పాత్ర వయసు గురించి చెప్పను. వచ్చే నెలలో తైవాన్లో చిత్రీకరణ జరుగుతుంది. అందులో నేను కూడా పాల్గొంటాను అని తెలిపింది. కాజల్తోపాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.













