గోపీచంద్ సరసన కాజల్ ?
గోపీచంద్‌తో కాజల్ అగర్వాల్ జోడీకట్టనుందా? వీరిద్దరి కలయికలో తొలిసారి ఓ సినిమా రానుందా? అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సాహసం తర్వాత హీరో గోపీచంద్, నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్ కాంబినేషన్లో మరో సినిమా రూపుదిద్దుకుంటున్నది. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బిను సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. గోపీచంద్ ప్రియురాలిగా ఆమె పాత్ర వినూత్నంగా సాగనున్నట్లు తెలిసింది. జూన్‌లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో సీత తమిళంలో పారిస్ పారిస్, కోమలి సినిమాల్లో నటిస్తున్నది.













