13 ఏళ్ళ కెరీర్… 15 మిలియన్ ల ఫాలోవర్స్!
2004లో `క్యోం! హోగయానా` చిత్రంతో బాలీవుడ్ చిన్న క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తెలుగులో `లక్ష్మీకల్యాణం` చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా హీరోయిన్గా ఆమెకు మంచి పేరు తెచ్చినా ఆ తర్వాత చేసిన `చందమామ` ఆమెకు బ్రేక్ ఇచ్చింది. వరసగా అవకాశాలు రావడంతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈమధ్యకాలంలో వస్తున్న హీరోయిన్లు ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించలేకపోతున్నారు. కాజల్ మాత్రం 13 సంవత్సరాల పాటు నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ అరడజను సినిమాలతో బిజీగానే ఉంది. మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటిస్తోంది. అంతకుముందు `ఖైదీ నంబర్ 150`లో కూడా చిరంజీవితో జతకట్టింది. హిందీలో సూపర్‌హిట్ అయిన `క్వీన్` చిత్రానికి రీమేక్‌గా తమిళ్లో రమేష్ అరవింద్ తెరకెక్కించిన `ప్యారిస్ ప్యారిస్` విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఇండియన్2`లో కూడా కాజల్ నటిస్తోంది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రస్తుతం 6 సినిమాలు చేస్తోంది. 35 సంవత్సరాల కాజల్‌కు ఇప్పుడున్న హీరోయిన్ల కంటే ఫ్యాన్ పాలోయింగ్ కూడా ఎక్కువ. సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉండే కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆమెకు ఉన్న ఫాలోవర్స్ 15 మిలియన్ క్రాస్ అయ్యారు. ఇప్పుడు సౌత్‌లో ఉన్న హీరోయిన్లలో ఎవ్వరికీ ఇంత ఫాలోయింగ్ లేదు. అంటే ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆమె ఛరిష్మా అలాగే ఉందంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఇప్పట్లో ఏ హీరోయిన్ ఆమెను క్రాస్ చేసే అవకాశం లేదు.













