కాజల్ అగర్వాల్ కు అరుదైన గౌరవం
వెన్నెలను నిలువెత్తు రాశిలా పోస్తే కాజల్‌లా ఉంటుందేమో అనేంత చూడచక్కని అందం ఆమెది. ఈ అందాన్ని దశాబ్దకాలంగా ఆరాధిస్తున్నారు ఆమె ఆభిమానులు. సొగసు కాజల్‌ని మైనపు బొమ్మను మలిచింది సింగ్‌పూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. సింగ్‌పూర్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది కాజల్. తన మైనపు బొమ్మ పక్కన నిల్చొని ఫొటోకు పోజులిచ్చి మురిసిపోయింది. ఈ కార్యక్రమంలో కాజల్ సోదరి నిషా అగర్వాల్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖులు సరసన నా మైనపు బొమ్మ కొువు తీరడం గౌరవంగా, గర్వంగా ఉంది అని ఈ సందర్భంగా ట్వీట్ చేసింది కాజల్.













