జయసుధగా కాజల్ ?
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌తో నటించిన సావిత్రి, కృష్ణకుమారి, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్ల పాత్రలు ఖారారైపోయాయి. కానీ, ఎన్టీఆర్‌తో అడవిరాముడు, డ్రైవర్ రాముడు వంటి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించడంతోపాటు, ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్టీఆర్ నటించిన నా దేశం చిత్రంలో నటించిన సహజ నటి జయసుధ పాత్రను ఎవరితోనూ నటింపజేస్తున్నారు? విశ్వసనీయ సమాచారం మేరకు సహజనటి పాత్ర కోసం కాజల్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. బాలయ్య కాజల్‌పై డ్రైవర్రాముడులోని గుగ్గు గుగ్గు గుడిసెంది..మంమం మంచముంది అనే సూపర్‌హిట్ పాట చిత్రీకరిస్తారేమో చూడాలి మరి.













