కళ్యాణం చేసుకోబోతున్న కాజల్ అగర్వాల్
అందాల హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి పెళ్లి కుదిరింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు పెళ్లి సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లు అనే బడా వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారినట్లు సమాచారం. రెండు కుటుంబాల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాజల్ పెళ్లిపై రూమర్లు రావడం ఇదే తొలిసారి కాదు. తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఆమె ఎన్నోసార్లు ఖండించారు.
తాజాగా జరుగుతున్న ప్రచారంపై కాజల్ స్పందించకపోవడంతో ఇది నిజమే అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆమెకు అప్పుడే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తన అందచందాలు, అభినయంతో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకుంది. ‘మగధీర ’తో స్టార్డమ్ దక్కించుకుని రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్‌కళ్యాణ్ తదితర స్టార్ హీరోల పక్కన నటించింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లోనూ ఆడిపాడింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, కమల్‌హాసన్ సరసన ఇండియన్-2 సినిమాల్లో నటిస్తోంది. మంచు విష్ణుతో మోసగాళ్లు, బాలీవుడ్లో జాన్ అబ్రహాంతో ఓ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.













