శ్రీలీలను ఆకాశానికెత్తేసిన కాజల్
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటించింది. సినిమాలో బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ కానున్నాయని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమాను తెగ ప్రమోట్ చేస్తుంది. వరుస ఇంటర్వ్యూలతో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాజల్ రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తెలివిగా కష్టపడుతున్న శ్రీలీలకు మంచి ఫ్యూచర్ ఉందని కాజల్ అభిప్రాయపడింది. ఏదైనా పనిని ఛాలెంజ్‌గా తీసుకుంటే కచ్ఛితంగా దాన్ని సాధిస్తామని, శ్రీలీలలో ఆ క్వాలిటీని చూసినట్లు, తను చాలా కష్టపడుతుందని, ప్రతి ఒక్కరితో చాలా గౌరవప్రదంగా ఉంటూ అందరి హృదయాలను గెలుచుకుంటూ చాలా ప్లానింగ్ తో ముందుకెళ్తుందని కాజల్ చెప్పుకొచ్చింది. అంతేకాదు శ్రీలీల సెట్ లో ఉంటే చాలా సరదాగా ఉంటుందని, తనతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందంటూ కాజల్ శ్రీలీల ను పొగిడేసింది.













