కాజల్..కలరిపయట్టు నేర్చుకుంటోంది!
కరోనా కారణంగా దేశమంతా లాక్డౌన్లో ఉండడంతో ఎప్పుడు బిజీ బిజీగా గడిపే సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై పోయారు. మరికొందరు ఇంట్లోనే ఉంటూ బోర్‌గా ఫీలవుతున్న జనానికి సోషల్ మీడియా ద్వారా వినోదాన్ని పంచుతున్నారు. ఇది కూడా సామాజిక సేవలో ఓ భాగమే కదా. ఆ క్రమంలో ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ ఇంట్లోనే ఉంటూ కలరిపయట్టు నేర్చుకుంటోంది. ఆమె నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఈ విద్యకు సంబంధించిన ప్రస్తావన ఉంది. అందుకోసం ఈ విద్యలో కాజల్ ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా హాలీడేస్‌తో ఈ విద్యను ప్రొఫెషనల్‌గా నేర్చేసుకుంటోందట కాజల్. ఏదో సినిమా కోసమే అన్నట్లుగా కాకుండా ఆరోగ్యపరంగానూ తనకు ఈ శిక్షణ తోడ్పడుతోందని చెబుతోంది. ఫిట్‌నెస్‌ని పెంచేందుకు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతోందట. కొన్ని వీడియోలను చూసి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్.













