కాజల్ ఆశలన్నీ దానిపైనే!
లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ మగధీర సినిమాతో మంచి హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా యంగ్ హీరోలతో పాటూ, టైర్ 2 హీరోలతో కూడా కలిసి నటించింది. ఓ వైపు తెలుగు మరోవైపు తమిళ భాషల్లో నెంబర్ 1 హీరోయిన్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
కాజల్ బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో లతో కలిసి నటించింది. కానీ తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన గుర్తింపు కాజల్ కు అక్కడ రాలేదు. 2020 లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుని సంతోషం గా ఉంటున్న కాజల్ కి ఓ బాబు కూడా పుట్టాడు. పెళ్లి తర్వాత రెండేళ్ళు మూవీలకు గ్యాప్ ఇచ్చిన కాజల్, ఈ ఇయర్ భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
రీ ఎంట్రీ లో భాగంగా కాజల్ నుంచి ఇప్పటికే తమిళం లో ఓ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇండియన్ 2 లో కూడా కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. హిందీ లో ఉమ అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ లోనూ, తెలుగు లో సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ లోనూ కాజల్ నటిస్తోంది. దీనితో ఇప్పుడు కాజల్ ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న భగవంత్ కేసరి పైనే ఉన్నాయి. మరి ఈ సినిమా తో అమ్మడు బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.













