సీనియర్, జూనియర్ అనే తేడా లేకండా ఏ హీరోతో అయినా సై – కాజల్ అగర్వాల్
గతం లో కాజల్ జోరు తగ్గుతుందని అనిపించినప్పుడే ఆమెకి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో అవకాశం దక్కింది. ఆ తరువాత కవచం, సీత, ప్రస్తుతం ఆచార్య ‘భారతీయుడు 2’ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది.ఉదయనిధి స్టాలిన్ మూవీలో నటిస్తుంది.. ఇందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రమేష్ అరవింద్ దర్శకత్వం లో పారిస్ పారిస్ చిత్రాల్లో నటిస్తుంది. గతంలో మురుగదాస్ దర్శకత్వం విజయ్ హీరోగా నటించిన ‘తుపాకి’ మూవీలో నటించింది. దేశంలో ఉండే స్లీపర్ సెల్స్ నేపథ్యంలో తెరకెక్కించారు ఈ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనిలో ఉన్నారు దర్శకులు. 2012 లో వచ్చిన ఆ సినిమా విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.
గతంలో కాజల్ చేసిన పాత్రకి కొనసాగింపుగా ఆమెనే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానున్నట్టు చెబుతున్నారు. ఈ మూవీ తెలుగు లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే సీక్వెల్ తోను ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.













