మరక మంచిదే.. కోపం మంచిదే!
మరక మంచిదే అన్నట్లు కోపం కూడా మంచిదే అంటోంది కాజల్. సాధారణంగా తన కోపమే తన శత్రువు అనే మాటలు వింటుంటాం. కాజల్ మాత్రం ఆ కొటేషన్ని కొత్తగా మార్చేసింది. కోపం మన ఉద్వేగంలో ఓ భాగమే. దాన్ని ఎంత దారిలో పెట్టాలన్నా కుదరడం లేదు. అయితే అప్పుడప్పుడూ కోపం కూడా మనకు మంచే చేస్తుంటుంది. మనం చేసిన పనుల వల్లో, తీసుకున్న నిర్ణయాల వల్లో కొన్ని సార్లు ఓడిపోతుంటాం. అలాంటి సమయంలో మనపై మనకే కోపం వస్తుంది. అలాంటి సమయంలోనే మన తప్పులేంటో తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ప్రతిసారీ సానుకూలంగానే ఆలోచించడం కుదరని పని. మన ప్రయాణంలో ప్రతికూలతలన్నీ ఇలాంటి సమయంలోనే బయటపడతాయి. అయితే ఓ స్థాయికి మించిన కోపం అస్సలు పనికి రాదు. మన కోపం మనపైనే అయితే ఫర్వాలేదు. పక్కవాళ్లపై అయితే బంధాలు తెగిపోతాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటా అంది కాజల్.













