నా పెళ్లా… నాన్ననే అడగండి!
ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ వరంగల్లో సందడి చేసింది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియా సమవేశంలో మాట్లాడారు. కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి ప్రస్తావన రాగా నా పెళ్లి గురించి పక్కనే ఉన్న మా నాన్నను అడగండి అని అంటూనే అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నారు. అయితే పెళ్లి అందరికీ చెప్పే చేసుకుంటానని సృష్టం చేశారు. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అన్నది ఇప్పుడే చెప్పనన్నారు. వరంగల్లోని వేయిస్తంభాల ఆలయం బాగా నచ్చిందని, మంచి కథ, కొత్త కథనం దొరికినట్లైయితే ఇక్కడ షూటింగ్ చేసే అవకాశం ఉందన్నారు.
క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు అలాంటి సంఘటన ఎదురుకాలేదని, అయితే అమ్మాయిలు అవగాహనతో, అబ్బాయిలు బాధ్యతాయుతంగా ఉంటే అందరికీ మంచిది అని అన్నారు. సినీ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధి బారినపడి విషయాన్ని ఆమె దృష్టికి తీసుకరాగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూనే మా తాతాయ్య కూడా క్యాన్సర్ బారిన పడి మరణించారని తెలిపారు. క్యాన్సర్ రోగులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. సమాజ సేవ కోసం కొన్ని ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొంటున్నానని, ప్రచారం కోసం కాదన్నారు. సంతృప్తి కోసమే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు.













