మా ఇద్దరి ప్రేమ నుండి ఇది పుట్టింది…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిగా సత్తా చాటడమే కాదు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతుంది. ఇప్పటికే తన సోదరితో పలు బిజినెస్‌లు చేస్తున్న కాజల్ ఇప్పుడు తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కిచ్డ్ పేరిట హోమ్ డెకార్ బ్రాండ్‌ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. గౌతమ్ నేను కలిసి మీ కోసం కిచ్డ్ అనే హోమ్ డెకార్ లేబుల్‌ని తీసుకొస్తున్నాము. మా ఇద్దరి ప్రేమ నుండి ఇది పుట్టింది. ప్రస్తుతం ఫెస్టిన్ థీమ్‌తో చేతితో తయారుచేయబడిన కుషన్స్‌ని తెస్తున్నాము. అందరికి నచ్చేలా. ఇంటి అందాన్ని పెంచేలా ఈ ప్రొడక్ట్స్‌ని తీసుకురావడమే మా బ్రాండ్ ప్రధాన ఉద్దేశం. మీ సపోర్ట్ మాకు తప్పక ఉంటుందని ఆశిస్తున్నాను. లిమిటెడ్ కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా షాపింగ్ చేయండి. మా బ్రాండ్ నుండి వస్తున్న తొలి ప్రొడక్ట్స్‌ని ఎంజాయ్ చేయండి అని కాజల్ పేర్కొంది.













