Kabir Khan: బజరంగీ భాయిజాన్ సీక్వెల్ పై కబీర్ ఖాన్ క్లారిటీ

సల్మాన్ ఖాన్(Salman khan) కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్లలో బజరంగీ భాయిజాన్( bajrangi bhaijaan) కూడా ఒకటి. కబీర్ ఖాన్(Kabir Khan) దర్శకత్వంలో 2015 జులై 17న రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. మొన్నామధ్య ఈ సినిమాకు సీక్వెల్ గా సినిమా వస్తుందని అన్నారు. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
బజరంగీ భాయిజాన్ మంచి సినిమా అని, ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే అది మొదటి సినిమాను మించి ఉండాలనుకుంటున్నానని కబీర్ ఖాన్ రీసెంట్ గా ఓ సందర్భంగా చెప్పారు. ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ చేస్తామని, ఆ సీక్వెల్ ఈ జెనరేషన్ కు తగ్గట్టు ఉండేలా ప్లాన్ చేస్తామని, సొంత ప్రయోజనాల కోసం మాత్రం ఆ సీక్వెల్ ను తీయనని ఆయన అన్నారు.
సీక్వెల్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నానని చెప్పిన కబీర్ ఖాన్, మొదటి సినిమా సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనో, మంచి కలెక్షన్ల కోసమో తొందరపడి సీక్వెల్ ను చేయమని, మంచి కథ ఎప్పుడొస్తే అప్పుడు ఆ సీక్వెల్ ను చేస్తామని కబీర్ ఖాన్ వెల్లడించారు. గతంలో ఈ సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్(vijayendra Prasad) కూడా ఈ సీక్వెల్ పై మాట్లాడారు. ఈ సీక్వెల్ కోసం తాను సల్మాన్ కు ఓ పాయింట్ చెప్పానని, అది అతనికెంతో నచ్చిందని ఏమవుతుందో చూడాలని ఆయన అన్నారు.