కళాతపస్వికి ఫాల్కే అవార్డు ప్రదానం
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ రాష్ట్రపతి ప్రణబ్ మఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక బాబా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో విశ్వనాథ్‌కు ఫాల్కేతోపాటు ఉత్తమ అవార్డులను పలువురు సినీ ప్రముఖులకు రాష్ట్రపతి అందించారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు సమావేశానికి అధ్యక్షత వహించారు. కాశీనాథుని విశ్వనాథ్‌కు మొదట శాలువ కప్పి సత్కరించిన రాష్ట్రపతి, అనంతరం దాదా సాహేబ్ పాల్కే అవార్డు, ప్రశంసా పత్రాన్ని ఆహూతుల కరతాళధ్వనుల మధ్య అందించారు. శతమానంభవతి సినిమాకు లభించిన స్వర్ణ కమలం అవార్డును చిత్ర దర్శకుడు వి.సతీష్ అందుకున్నారు. పెళ్లిచూపులు చిత్రానికి లభించిన రజత కమలం అవార్డును చిత్ర దర్శకుడు డి తరుణ్‌భాస్కర్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ స్వీకరించారు.













