కళాతపస్వికి మరో అరుదైన గౌరవం
కళాతపస్వి, దర్శకరుషి కె.విశ్వనాథ్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బుధవారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం వేదికపై ఆయన ప్రసంగిస్తారు. 1969లో ఈ అవార్డు ఇవ్వడం మొదలు పెట్టిన నాటి నుంచి ఏ పురస్కార గ్రహీతకూ ఈ అవకాశం దక్కలేదు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చొరవతో విశ్వనాథ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఐదు పదుల ఏళ్లనాటి సినీ ప్రస్థానం, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషిపై ఆయన మాట్లాడనున్నారు.













